కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
శ్రీ వీరశైవ లింగాయత్ సమాజ్ మరియు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వార్షికోత్సవంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు.
ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, భూపతి, సాయిబాబా, చేవెళ్ల రాజు, రంగా రమేష్ గౌడ్, రాజశేఖర్, బల్ల శ్రీనివాస్, పండు శ్రీకాంత్ తో పాటు ఆలయ కమిటీ అధ్యక్షులు కపిల ప్రభాకర్, మాదంశెట్టి ఆంజనేయులు, వీరన్న పటేల్, చెంబాల సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.


