తిరుపతిలో నకిలీ మద్యం తయారీ జరుగుతున్నట్లు పోలీసుల కార్డెన్ సెర్చ్ లో వెల్లడైంది. శేషాద్రి నగర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్న వ్యక్తితో పాటు నకిలీ మద్యం కూడా లభించింది.
పాడిపేటలోని ఇందిరమ్మ గృహాలలో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు తిరుచానూరు పోలీసులు అక్కడికి చేరుకొని, నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి రూరల్ డి.ఎస్.పి బేతంపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దాడులు భారీ ఎత్తున జరిగాయి. ఆయన పర్యవేక్షణలో 5 మంది సి.ఐ.లు, 10 మంది ఎస్.ఐ.లు, ఇతర సిబ్బంది ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యం పరిమాణం, దానితో పాటు పట్టుబడిన వ్యక్తుల వివరాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నకిలీ మద్యం సరఫరా వెనుక ఉన్న పెద్దల గుట్టును రట్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

