మంచిర్యాల జిల్లాలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దొంగిలించబడిన నగదు, నగలు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
మార్చి 25, 2026 రాత్రి ముల్కల్ల గ్రామంలోని దర్వాజ రాజయ్య ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో సుమారు 2000 రూపాయలు, 3 తులాల వెండి పట్టా గొలుసులు, 20 అమెరికన్ డాలర్లు దొంగిలించబడ్డాయి.
దొంగతనం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితుల కదలికలపై నిఘా ఉంచి, దోనబండ బస్ స్టాప్ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో, నిందితులు తోకల రమేష్ (32) మరియు తౌటo అశోక్ (32) లగా గుర్తించారు. వీరిద్దరూ దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుండి దొంగిలించబడిన 2000 రూపాయలు, 3 తులాల వెండి పట్టా గొలుసులు, 20 అమెరికన్ డాలర్లను పోలీసులు రికవరీ చేశారు.
కేసును సకాలంలో ఛేదించి, నిందితులను పట్టుకున్న హాజీపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుళ్లు జి చంద్రశేకర్, బి తిరుపతిలను మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ అభినందించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించే ప్రక్రియ పూర్తయింది.











