రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా, ఈ ఆదేశాలు వెలువడ్డాయి. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.
అరెస్టయిన వారి నుంచి పలు రకాల డ్రగ్స్‌తో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ డ్రగ్స్ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
గతంలో ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే.











