భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని సదాశివానగర్ మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఆయన జీవితం మరియు సేవలను స్మరించుకున్నారు.
సి.డి.సి. చైర్మన్ ఈర్షద్, మాజీ వైస్ ఎంపీపీ గాదరి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వడ్ల రాజేందర్, ఎస్సీ విభాగం మండల అధ్యక్షులు భూపెల్లి కవీన్, గ్రామ ఉప సర్పంచ్ ప్రవీణ్, ఎస్సీ సెల్ మండల జనరల్ సెక్రెటరీ జగ్గ బాలరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆస సురేష్, మండల యూత్ అధ్యక్షులు శ్యాం బాబు, గ్రామ అధ్యక్షులు మరియు వార్డ్ మెంబర్ చిందం రాజయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన సమానత్వ సాధనకు చేసిన కృషిని పలువురు వక్తలు గుర్తు చేసుకున్నారు. యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
నాయకులు ఆస రాజు, చిన్నమని రాజయ్య, సంపత్ రాజయ్య, కొమ్ము సాయిలు, సింగరాయపల్లి రమేష్, సంపత్ అర్జున్, ఏల్లగారి సతీష్, బండ భాగి, రోహిత్ తో పాటు అనేక మంది గ్రామస్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.











