ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కూకట్పల్లిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన కార్యాలయంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్లు, ముస్లిం సోదరులు వెంకటేష్ గౌడ్ పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, మత పెద్దలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఎన్.టి.ఆర్ నగర్ కాలనీలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో వెంకటేష్ గౌడ్ పేరు మీద హారతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతేకాకుండా, సాయి నగర్ (రాఘవేంద్ర నగర్) కాలనీలోని శ్రీ రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం అందించి, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాలలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











