సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైలులో విదేశీయుల కోసం నిర్మిస్తున్న ట్రాన్సిట్ హోం నిర్మాణ పనులను ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఎం.శ్రీనివాస్ బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు.
ఐజీ శ్రీనివాస్ నిర్మాణ పనుల తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విదేశీయులు నివసించడానికి అనువుగా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
త్వరలో ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.











