కామారెడ్డి జిల్లా గర్గుల్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల పంపిణీ జరిగింది.
కామారెడ్డి జిల్లా పరిధిలో గర్గుల్ గ్రామంలోని MPPS గర్గుల్ పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఆర్థిక సహకారం అందించిన నరేష్ ని పాఠశాల ఉపాధ్యాయ బృందం సత్కరించింది.
ఉపాధ్యాయులు, విద్యార్థులు నరేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











