తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువతకు భారత వైమానిక దళంలో చేరేందుకు ఒక గొప్ప అవకాశం లభించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో గుంటూరులో ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించబడుతోంది.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపిన వివరాల ప్రకారం, 12 ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్ ద్వారా అగ్నివీర్వాయు నియామకానికి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 8 నుండి 18 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి అభ్యర్థులు పాల్గొనవచ్చు.
అభ్యర్థులు తమ అర్హతలు, వయోపరిమితి, విద్యార్హతలు మరియు అవసరమైన పత్రాల వివరాల కోసం భారత వైమానిక దళం అధికారిక వెబ్సైట్ https://agnipathvayu.cdac.in ను సందర్శించాలని సూచించారు. ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


