మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి బాలికలు చదువులో ముందుండి అన్ని రంగాలలో రాణించాలి అని తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా 100 సైకిళ్లు అందించే కార్యక్రమం మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ వంద శాతం హాజరు సాధించిన బాలికలను ఎంపిక చేసి వారికి ఈ సైకిళ్లను మంజూరు చేయడం జరిగింది.
ప్రారంభంలో 21 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఎస్బీఐ రీజినల్ మేనేజర్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

