ఆర్మూర్ పట్టణంలోని కృష్ణవేణి హై స్కూల్ లో సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు విగ్నేష్, సుమతి విద్యార్థినులకు పలు సూచనలు చేశారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్ చేసినా వెంటనే షీ టీంకు సమాచారం ఇవ్వాలని కానిస్టేబుళ్లు విగ్నేష్, సుమతి సూచించారు. విద్యార్థినులు, ఉద్యోగినులు, మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే పోలీసు శాఖ ఏర్పాటు చేసిన షీ టీంను సంప్రదించాలని తెలిపారు.
సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, భయపడకుండా ఫిర్యాదు చేస్తే తగిన రక్షణ కల్పిస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈవ్ టీజింగ్‌కు గురయ్యేవారు నిర్భయంగా సమాచారం ఇవ్వాలని కోరారు.
షీ టీం నంబర్ 8712659795 లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. క్యూఆర్ కోడ్ ద్వారా షీ టీంకు ఫిర్యాదు చేసే విధానాన్ని కూడా మహిళలకు వివరించారు.
ఈ అవగాహన సదస్సులో కృష్ణవేణి హై స్కూల్ ప్రిన్సిపాల్ మహమ్మద్ మినాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు, విద్యార్థులు పాల్గొన్నారు.

