తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ వైఖరిని ఆయన తప్పుబట్టారు.
తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారని, దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట విభజన సమయంలో కాంగ్రెస్ తప్పిదాలతో పలువురు యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఎంపీ తేజస్వి సూర్య చెప్పారని తెలిపారు. 2009లో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు సహకరించి మళ్లీ వెన్నక్కి తగ్గారని.. దీని గురించే తేజస్వి సూర్య మాట్లాడారని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రేవంత్ రెడ్డి గతంలో సోనియాగాంధీని బలిదేవత అన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు. కరీంనగర్లో రణభేరి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని వెళ్లారని కేంద్ర మంత్రి తెలిపారు. 1400 మంది బలిదానాలకు హత్యలకు కారణమైన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.
ఒక్క ఓటు, రెండు రాష్ట్రాలు అనే నినాదానికి కట్టుబడి, రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చింది బీజేపీ అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ కావాలని అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతి గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్ వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన తప్పుల వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. బీజేపీ మాత్రం 'ఒక్క ఓటు, రెండు రాష్ట్రాలు' నినాదానికి కట్టుబడి రాష్ట్ర విభజనకు మద్దతు పలికిందని ఆయన స్పష్టం చేశారు.








