రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిర్మించుకున్న నూతన గృహానికి ఈరోజు గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి పాల్గొన్నారు.
రాంరెడ్డిపల్లె గ్రామంలో సంపంగి మమత–శ్రీనివాస్ దంపతులు నిర్మించుకున్న ఇంటికి గృహప్రవేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏళ్ల బాల్ రెడ్డి దంపతులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
పేదల సొంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఏళ్ల బాల్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నూతన గృహ ప్రవేశానికి వచ్చిన వారందరూ దంపతులను అభినందించారు.

