రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 7,074 మందికి లబ్ధి చేకూరుస్తూ, రూ.56.39 కోట్లు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ఈ విడుదల ద్వారా వివిధ అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్థిక చేయూత లభించనుంది.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన వారికి అందజేస్తున్న ఆర్థిక చేయూతలో భాగంగా ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులను వైద్య ఖర్చులు, విద్య, ఇతర అత్యవసర అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించినట్లు సమాచారం.
గత 22 నెలల గౌరవ కూటమి ప్రభుత్వ కాలంలో, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మొత్తం 1,43,314 మంది లబ్ధిదారులకు రూ.1,298.33 కోట్లు అందజేయబడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ఆర్థిక సహాయం అందించడం గత ప్రభుత్వాల పాలనలో ఎన్నడూ జరగలేదని, ఇది ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.











