తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) కేంద్ర సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో మారం జగదీష్ అధ్యక్షుడిగా, ఎస్.ఎం. హుసేని ముజీబ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జరిగిన ఎన్నికల ప్రక్రియలో, ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా నూతన కమిటీ పని చేస్తుందని ప్రతినిధులు తెలిపారు. అసోసియేట్ అధ్యక్షులుగా కస్తూరి వెంకట్, సత్యనారాయణ గౌడ్, కోశాధికారిగా శ్రీమతి ఉమాదేవి ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా సిహెచ్ నరసింహ చారి, సిహెచ్ నరసింహారెడ్డి, డి. రాము, ఈ. కొండల్ రెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలిగా శ్రీమతి నిర్మల రాజకుమారి రాథోడ్ ఎంపికయ్యారు. కార్యదర్శులుగా ఏ. తిరుమలరెడ్డి, నజీర్ అహ్మద్, రాగి శ్రీనివాస్, పి. శ్రీనివాస్, శ్రీమతి శైలజ (మహిళా కార్యదర్శి) బాధ్యతలు స్వీకరించారు.
నిర్వాహక కార్యదర్శిగా జైపాల్ విజయ్ కుమార్, ప్రచార కార్యదర్శిగా సర్దార్ హరివిందర్ సింగ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీమతి జి. అనురాధ, శ్రీమతి గీతారాణి, కే. సుభాష్ చంద్ర నియమితులయ్యారు. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా టీఎన్జీవోస్ విభాగం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించింది.











