కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రోడ్డులోని మార్వాడి ధర్మశాల వద్ద బోటిక్, లేడీస్ టైలర్ అసోసియేషన్ సభ్యులు నిరసన చేపట్టారు. సిద్దిపేట వ్యాపారి కంప్యూటర్ వర్క్ బ్లౌజులను అతి తక్కువ ధరలకు విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారం నిర్వహిస్తున్న తాము, EMIలు, అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని నిరసనకారులు తెలిపారు. ధర్మశాలలో రూ. 1000కే 5 బ్లౌజులు విక్రయించడం తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరహరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యాపారితో మాట్లాడి, అమ్మకాలను నిలిపివేయాలని సూచించారు. సీఐ జోక్యంతో నిరసనకారులు తమ ఆందోళనను విరమించుకున్నారు.








