తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళల సాధికారత, సంక్షేమం కోసం మహిళా కమిషన్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు.
నూతన సభ్యులుగా ఎన్నికైన కానేపల్లి శంకరమ్మ, సనావత్ రాధాబాయి, చిట్యాల శ్వేతలకు కూడా ఝాన్సీ రాజేందర్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మహిళల హక్కుల పరిరక్షణతో పాటు వారి అభివృద్ధికి మహిళా కమిషన్ కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. నూతన నాయకత్వం రాష్ట్రంలో మహిళా సంక్షేమ కార్యక్రమాలకు కొత్త ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తమైంది.










