మహబూబాబాద్ జిల్లాలోని ఐదు ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 50 అంగన్వాడి కేంద్రాలకు RO వాటర్ ఫిల్టర్లు మరియు BALA పెయింటింగ్ కొనుగోలు కోసం జిల్లా సంక్షేమ అధికారి సబిత టెండర్లను ఆహ్వానించారు.
ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖలో రిజిస్టర్ అయిన వ్యాపారస్తులు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు.
టెండర్లను ఏప్రిల్ 2వ తేదీ నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు సాయంత్రం 5:00 గంటల లోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు సూచించారు.
ఈ కొనుగోలు ద్వారా అంగన్వాడి కేంద్రాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించబడతాయని భావిస్తున్నారు.
మరింత సమాచారం కోసం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.











