తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న జనాభా గణన-2027, దశ-I హౌజ్లిస్టింగ్ ఆపరేషన్స్ (HLO) కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోలీకేరి అధ్యక్షతన గురువారం సాయంత్రం ఒక వర్చువల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లు (PCOs)గా ఉన్న జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, అలాగే మండలాల, మున్సిపల్ కౌన్సిల్ల, సర్కిళ్ల ఛార్జ్ అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో జరుగుతున్న హౌజ్లిస్టింగ్ కార్యకలాపాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, జనాభా గణన-2027 కార్యక్రమాన్ని నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరణను ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు. మొబైల్ వ్యాన్ ద్వారా అన్ని మండలాల్లో అవగాహన కల్పించాలని కూడా ఆయన అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












