కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా, షబ్బీర్ అలీ నివాసం వద్ద ఉన్న చౌక ధరల దుకాణంలో 'ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం' జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చీరలు అందజేశారు.
ప్రభుత్వ సలహాదారు శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రతి కుటుంబానికి అండగా నిలబడి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ధ్యేయమని తెలిపారు. ఇంద్రమ్మ చీరల వంటి పథకాలు మహిళలకు గౌరవాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో అమలువుతున్న ఇంద్రమ్మ ఇళ్లు, 2బిహెచ్కే గృహాలు, పెన్షన్ పథకాలు, రైతులకు మద్దతు వంటి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, కౌన్సిలర్లు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. లబ్ధిదారులకు చీరలు అందజేయడంతో పాటు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చ జరిగింది.












