నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలంలో తాసిల్దార్ కార్యాలయాన్ని వ్యక్తిగత వాహనాల పార్కింగ్ కోసం వాడుకుంటున్నారని, దీనిపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చిల్లకూరు మండల తాసిల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, కార్యాలయం మధ్యలో వాహనాన్ని నిలిపి ఉంచుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన కార్యాలయం, వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం తాసిల్దార్ కోసం కేటాయించిన అద్దె వాహనాన్ని, ప్రజల రాకపోకలకు అడ్డుగా నిలుపుతున్నారని, దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బాధితులు తెలిపారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
ఈ వ్యవహారంపై స్థానిక అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదో రహస్యం దాగి ఉందని, పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను ప్రజల సౌకర్యార్థం మాత్రమే వినియోగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.











