కామారెడ్డి, 08.07.2026
గాంధారి మండలంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం పర్యటించి, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ - SIR ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, SIR ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ ఈ నెల 20లోపు ఎన్యుమరేషన్ ఫారములను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.
గాంధారి మండలంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం పర్యటించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ - SIR ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యుమరేషన్ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, SIR ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో పేర్లు కొనసాగేందుకు ప్రజలందరూ ఈ నెల 20లోపు ఎన్యుమరేషన్ ఫారములను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. అర్హులైన ఒక్కరు కూడా జాబితా నుండి వదిలిపోకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
గ్రామాల్లో అవగాహన కల్పించి, ప్రజల నుండి ఫారములు సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సర్వే నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, RDO ప్రభాకర్, DRDO కామారెడ్డి దామోదర్ రెడ్డి, DEO కామారెడ్డి మల్లికార్జున్, DE Housing యెల్లారెడ్డి, MRO, MPDO, MPO, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












