ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా కొండాపూర్ మండలం తొగరపల్లి గ్రామంలో “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, అంగన్వాడీ సిబ్బంది, తల్లులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు.
లలిత కుమారి మాట్లాడుతూ, గర్భిణులు, బాలింతలు, ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలు అందించే పోషకాహారం, ఆరోగ్య సేవలు, ప్రాథమిక విద్య ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ సేవలను పొందడానికి ప్రతి తల్లి తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో డీసీపీవో రత్నం, సఖి కల్పన, గ్రామ సర్పంచ్ దివ్యవాణి, సీడీపీవో, సూపర్వైజర్లు పాల్గొన్నారు.












