సంగారెడ్డి, జూలై 21
పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీరంగూడలోని పార్టీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై బీఎల్ఏ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై బీఎల్ఏ సూపర్వైజర్లతో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో కోఆర్డినేటర్లు నాగరిగారి ప్రీతం, గూడూరు శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో ప్రతిరోజూ చేపడుతున్న ఎన్యూమరేషన్, ఫారమ్‌ల నింపుదల, ఓటర్ల వివరాల సేకరణ, ఇతర కార్యాచరణల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఫీల్డ్ స్థాయిలో సూపర్వైజర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు.
ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా బీఎల్ఏ సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.











