కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై, ప్రజల సమస్యలపై చర్చించారు.
సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలను ప్రజలకు తెలియజేయాలని, ప్రజల ఓట్లను తొలగిస్తూ, అభివృద్ధిని విస్మరిస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని నాయకులు అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి, ప్రజలకు ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.
గత రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇకనైనా అభివృద్ధి వైపు దృష్టి సారించాలని సమావేశంలో పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని, వారికి అండగా ఉన్నామని ధైర్యం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
త్వరలోనే బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్లు నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, మందడి శ్రీనివాసరావు, సాభియా గౌసుద్దీన్, పగడాల బాబురావు, తూము శ్రావణ్ కుమార్, మహేశ్వరి శ్రీహరి, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.











