సంగారెడ్డి, జూలై 29
శత్రువుదైనా సరే ఓటు మిస్ కాకుండా నమోదు చేయించాలని, ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాలు అందవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రజలను కాపాడటానికి సర్ ప్రక్రియకు తోడ్పడాలని రాహుల్ గాంధీ సూచించినట్లు ఆయన గుర్తు చేశారు. BLA లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మన శత్రువు అయినా సరే ఓటు మిస్ అవుతుంది అంటే ఆ ఓటు నమోదు చేయించాల్సిందేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోవద్దని, ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాలు అందవన్నారు.
ఓట్ల కోసం, రాజకీయాల కోసం కాకుండా ప్రజలను కాపాడటానికి సర్ ప్రక్రియకు తోడ్పడాలని రాహుల్ గాంధీ అన్నారని ఆయన గుర్తు చేశారు. నెల రోజుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారని, సర్ పై 5 సమావేశాలు పెడితే ప్రతి ఒక్క BLA వచ్చారని అభినందించారు.
చివరిగా ఆగస్ట్ 2న మరో సమావేశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉందని, నెల రోజుల నుంచి AICC ఇంచార్జి మీనాక్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ SIR పై జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ఏ ఒక్క ఓటు మిస్ కావద్దని, బీజేపీ కుట్రలు ఎటు నుంచి ఎటు పోతాయో తెలియదన్నారు. ఎన్నికల సంఘం మోడీ ప్రభుత్వ నేతృత్వంలో పని చేస్తున్నదని ఆరోపించారు.
బోనాల పండుగ ఉందని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఓటు హక్కు పోతే మళ్ళీ రాదని, మనకి ఓట్లు వేస్తారా లేదా అని ఆలోచన చేయొద్దని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, నియోజవర్గ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, వివిధ మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.












