నిజామాబాద్, జూలై 25
దేశ యువత భవిష్యత్తు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే తన రాజీనామాకు ప్రధాన కారణమని కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించిన రాజీనామా లేఖలో తన నిర్ణయానికి గల కారణాలను వివరించారు.

భారత ప్రజాస్వామ్యంపై తనకు అచంచల విశ్వాసం ఉందని, దేశ యువత ఆశయాలు, ఆకాంక్షలను ఎల్లప్పుడూ గౌరవిస్తానని ఆయన తెలిపారు. గత పది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. యువత అపోహలు, దుష్ప్రచారాల బారిన పడకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
దేశ ఐక్యతకు ఎలాంటి భంగం కలగకుండా, ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదన్న సంకల్పంతోనే తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రికి సమర్పించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యాశాఖ అధికారులు, సహచర మంత్రులు, శాఖ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
దేశసేవే తన జీవిత లక్ష్యమని పేర్కొన్న ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భవిష్యత్తులోనూ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు సేవలందిస్తూనే ఉంటానని రాజీనామా లేఖలో వెల్లడించారు.