Kurnool/Maddikera East (ప్రశ్న ఆయుధం) జూలై 29
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారమ్‌ల (ఈఎఫ్ఎస్) ప్రక్రియను 100 శాతం పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. లక్ష్యాన్ని గడువులోగా విజయవంతంగా పూర్తి చేసిన ఎన్నికల యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

నియోజకవర్గంలోని మొత్తం 2,28,503 మంది ఓటర్లలో 2,06,220 మంది (90.25 శాతం) ఈఎఫ్ఎస్ డిజిటైజేషన్ పూర్తిచేయగా, 22,283 మంది (9.75 శాతం) ఓటర్లకు సంబంధించిన ఫారమ్‌లు అందుబాటులో లేకపోవడంతో వాటిని 'అన్కలెక్టెడ్ ఫార్మ్స్'గా నమోదు చేసి మొత్తం ప్రక్రియను 100 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లు, బీఎల్వోలు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిబ్బంది సమిష్టి కృషిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికల ప్రక్రియలో నాణ్యత, పారదర్శకతను కొనసాగిస్తూ భవిష్యత్‌లోనూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.