కామారెడ్డి, 2026-07-06
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ప్రతి గ్రామంలో, ప్రతి మాదిగ పల్లెలో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట్ రాములు పిలుపునిచ్చారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా జెండా ఆవిష్కరణ ఉంటుందని, ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ప్రతి గ్రామంలో, ప్రతి మాదిగ పల్లెలో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట్ రాములు పిలుపునిచ్చారు. అదేవిధంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రతి గ్రామంలో జెండాను ఎగురవేసిన అనంతరం కామారెడ్డిలో జరిగే కార్యక్రమంలో ప్రతి ఎమ్మార్పీఎస్ కార్యకర్త, ఉద్యోగి, మందకృష్ణ మాదిగ శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
మందకృష్ణ మాదిగ చేసిన సేవలను ప్రతి గ్రామంలో ప్రజలకు తెలియజేయాలని బట్ట వెంకట్రాములు సూచించారు. వర్గీకరణ, ఆరోగ్యశ్రీ, ఆరు కిలోల బియ్యం, చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు, ఉద్యోగులకు కమీషన్, ప్రమోషన్లు వంటి అనేక కార్యక్రమాలను సాధించిన గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. ఆయన పిలుపుమేరకు జెండా ఆవిష్కరణలు జరుగుతాయని తెలిపారు.












