సంగారెడ్డి, July 21
బీఆర్ఎస్వీ నాయకుడు అఖిల్ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అఖిల్‌ను సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
బీఆర్ఎస్వీ నాయకుడు అఖిల్ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అఖిల్‌కు శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం బోకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేక్ కట్ చేసి అఖిల్‌కు శుభాభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, వెంకటేష్ గౌడ్, విష్ణు, వాజిత్, చింటు, సంగమేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్వీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని అఖిల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.











