కామారెడ్డిలోని యశోద బ్రాంచ్ క్లినిక్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ బ్రాంచ్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు సీనియర్ నెఫ్రాలజిస్ట్ డా. విజయవర్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని, ఏడాదికి ఒకసారి బేసిక్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
డా. విజయవర్మ మాట్లాడుతూ, గత నాలుగేళ్లలో 381కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేశామని, 95 శాతం సక్సెస్ రేటు నమోదైందని తెలిపారు. పెద్ద వయసు వారు కిడ్నీ ఇవ్వకూడదనేది అపోహ మాత్రమేనని, బ్లడ్ గ్రూప్ వేరైనా మార్పిడి చేయవచ్చని చెప్పారు. అయితే, బ్లడ్ గ్రూప్ వేరైతే ఖర్చు కొంత అధికమవుతుందని వివరించారు.
మధుమేహం, అధిక రక్తపోటు కిడ్నీ ఫెయిల్యూర్ కు ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. రక్త సంబంధీకులు కిడ్నీ దానం చేయవచ్చని, స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, నొప్పి మాత్రల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చని సూచించారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైటెక్ సిటీ బ్రాంచ్ మేనేజర్ దనుంజయ్ పాల్గొన్నారు.












