ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో విఆర్కే జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, మంచి మార్కులను సాధించిన సందర్భంగా కళాశాలలో అభినందన సభ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేసి సత్కరించారు.
ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన ఫలితాలలో విఆర్కే విద్యార్థులు సాధించిన విజయం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. ఈ విజయం వెనుక కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థుల కృషి ఉందని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ, మంచి మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత రంగాలలో స్థిరపడాలని, అత్యుత్తమ ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఫలితాలలో ఏ నవోదయ (బైపిసి, సెకండియర్) 994/1000, పి మైథిలి (ఎంపీసీ, సెకండియర్) 993/1000, ఎం అనన్య (సీఈసీ, సెకండియర్) 982/1000, ఎం అఖిల (ఎంపీహెచ్డబ్ల్యూ, సెకండ్ ఇయర్) 987/1000 మార్కులు సాధించారు. అలాగే, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా మంచి ప్రతిభ కనబరిచారు.
900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల సీఈవో, కరస్పాండెంట్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం సాధించడానికి దోహదపడిన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.












