తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దోస్త్ (Degree Online Services, Telangana) నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ప్రవేశ ప్రక్రియ మూడు దశల్లో జరగనుంది.
దోస్త్ నోటిఫికేషన్ ప్రకారం, మొదటి విడత రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు కొనసాగుతాయి. అర్హులైన విద్యార్థులు రూ.200 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లకు ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు అవకాశం ఉంటుంది. మే 14న తొలి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది, ఆ తర్వాత ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
రెండో విడత రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి మే 25 వరకు జరుగుతాయి. వెబ్ ఆప్షన్లకు మే 15 నుంచి మే 26 వరకు అవకాశం కల్పించారు. మే 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ దశలోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి.
మూడో విడత రిజిస్ట్రేషన్లు మే 31 నుంచి జూన్ 15 వరకు ఉంటాయి. జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జూన్ 20న సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ దశలోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ ఉంటుంది.
సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 మధ్య కళాశాలల్లో అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. జూన్ 29, 30 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించి, జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.











