నిజామాబాద్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్) పరిసరాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, ఏప్రిల్ 15వ తేదీ ఉదయం జీజీహెచ్ రేకుల షెడ్ సమీపంలో అపస్ధితిలో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తిని పేషెంట్ కేర్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల చికిత్స పొందుతూ, ఏప్రిల్ 16వ తేదీ రాత్రి ఆ వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు సుమారు 42 ఏళ్లు ఉంటుందని అంచనా. అతను బూడిద రంగు టీషర్ట్, నీలి రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, భిక్షాటన చేసుకునే వ్యక్తిగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లభించలేదు.
ఈ గుర్తుతెలియని వ్యక్తికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రజల సహకారం కోరుతున్నట్లు తెలిపారు.
మరింత సమాచారం కోసం నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 8712659714. ఈ మేరకు ఇన్స్పెక్టర్ బి. రఘుపతి ఒక ప్రకటన విడుదల చేశారు.











