నిజామాబాద్, 2026-07-26
తానాగుర్దు గ్రామంలో ‘మన ఊరు–మన భద్రత, మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఇళ్లలో దొంగతనాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
తానాగుర్దు గ్రామంలో ‘మన ఊరు–మన భద్రత, మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఇళ్లలో దొంగతనాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు వివరించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ లావాదేవీలకు సంబంధించిన మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతులను వివరించి, మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కార్యక్రమం అనంతరం తానాగుర్దు గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ హరితహారంలో భాగస్వాములయ్యారు.












