సంగారెడ్డి, 2026-08-05
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలంతా సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ పేరుతో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో () డైరెక్టర్ షికా గోయల్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలరోజుల పాటు సురక్షా కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ పేరుతో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. ఆగస్టు నెల తొలి బుధవారం నిర్వహించే జాతీయ సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో సైబర్ నేరాలు ఒకటని పేర్కొన్నారు. సైబర్ నేరాలకు గురవుతున్న వారిలో విద్యావంతులే అధికంగా ఉండటం ఆందోళనకర విషయమని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో తెలియని వ్యక్తులు పంపే లింకులను ఓపెన్ చేయడం, నకిలీ పెట్టుబడి ఆఫర్లు, వ్యాపార పెట్టుబడి పేరుతో వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మడం వల్ల సైబర్ మోసాలకు గురవుతున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, సెయింట్ ఆంథోనీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ డా. సాల్మన్ రెడ్డి, డిగ్రీ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రామునాయుడు, సైబర్ సెల్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












