సంగారెడ్డి, ఆగస్టు 4
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పాల్గొన్న పాల్గొన్న ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల వేషధారణలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ కళారూపాలు వంటివి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ గౌడ్, చింత సాయినాథ్, భరత్ గౌడ్, కిరణ్ గౌడ్, సంకీర్త్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, దుర్గ గౌడ్, సంగమేశ్వర్ గౌడ్, కౌన్సిలర్ నాని, జీవీ శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, విఠల్, గోవర్దన్ రెడ్డి, ప్రభు గౌడ్, గౌడ సంఘం నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











