కామారెడ్డిలోని ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజీ ప్రాంగణంలో యూత్ ఫెస్ట్-2026 ను ఆర్కే గ్రూప్ ఆఫ్ కరస్పాండెంట్ మరియు సీఈవో డాక్టర్ ఎన్. జైపాల్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (RK, SRK, VRK) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షిక యూత్ ఫెస్ట్ లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. కరస్పాండెంట్ మరియు సీఈవో డాక్టర్ ఎన్. జైపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ గోదావరి స్వామి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, కౌన్సిలర్ నరేందర్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ సలాం, డాక్టర్ లలిత, ఆర్కే చైర్మన్ భాస్కర్ రావు లు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలు వంటి ఇతర రంగాలలో కూడా రాణించాలని, ఇది వారి సమగ్ర వికాసానికి దోహదపడుతుందని అతిథులు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత ప్రమాణాలను అందుకోవడానికి కృషి చేయాలని వారు సూచించారు.
వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమంటోలు, మెడల్స్ మరియు బహుమతులను అందజేసి, వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












