ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరగనున్న ఈ వర్చువల్ కార్యక్రమంలో, ప్రధానమంత్రి వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను ప్రారంభిస్తారు. అలాగే, హైదరాబాద్-పనాజీ ఎకానమిక్ కారిడార్‌లోని గుడెబల్లూర్-మహబూబ్‌నగర్ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల ప్రాముఖ్యత దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిని ఆహ్వానించింది.
జాతీయ రహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేసినట్లు సమాచారం.











