ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, అధికారులకు సూచనలు చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, సంబంధిత ఎస్.హెచ్.ఓలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కానప్పుడు, ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని అదనపు ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా పోలీసు అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.
ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.












