వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనల కోసం తెలంగాణకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నుండి వేలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి మార్గదర్శకత్వంలో కార్యకర్తలు సమన్వయంతో సభకు తరలివెళ్లారు. "సబ్కా సాథ్ – సబ్కా వికాస్" నినాదాలతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ప్రదర్శన నిర్వహించాయి. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, తెలంగాణ ప్రగతి లక్ష్యంగా సభ జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
సభలో పాల్గొన్నవారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రహదారులు, రైల్వేలు, ఐటీ, మౌలిక వసతులు, యువత ఉపాధి అవకాశాల కల్పనలో మోదీ ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తోందని వారు తెలిపారు.
తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణపై వారు విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభ పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని నింపింది.










