సృష్టికి మూలం, ప్రతి మనిషి జీవితానికి ఆదారం అయిన తల్లి ప్రేమ నిష్కల్మషమైనది. జన్మనిచ్చి, పెంచి, కాపాడుతూ జీవితాంతం తన ప్రేమను పంచే మహోన్నత వ్యక్తిత్వం తల్లి అని పలువురు పేర్కొంటున్నారు. పిల్లల ఆనందం కోసం తన సుఖాలను సైతం త్యజించే తల్లి గొప్పతనాన్ని మదర్స్ డే సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.
తల్లి అనేది కేవలం ఒక పదమని కాదని, ప్రతి హృదయానికి ఓదార్పు అని, ఆమె ప్రేమ అనంతమని, త్యాగం అపారమని అభివర్ణిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం “మదర్స్ డే”గా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక దినాన తల్లుల సేవలను, ప్రేమను స్మరించుకుంటారు.
అమ్మ అనేది కమ్మని పాట వంటిదని, ప్రతి ప్రాణికి వరం అని, ఆమె లేకుండా సృష్టి లేదనే భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.
మదర్స్ డే సందర్భంగా తల్లికి ప్రేమ, గౌరవం తెలియజేస్తూ, ఆమె చేసిన త్యాగాలను ఎప్పటికీ మరవకూడదని పలువురు పేర్కొంటున్నారు.












