నిజామాబాద్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో వ్యసన విముక్తి చికిత్స కేంద్రాన్ని శనివారం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, వ్యసనాలకు బానిసైన వారు చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది. దీనిని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు కమిషనర్ బహుమతులు అందజేశారు.
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఒకవేళ అలవాటు పడినట్లయితే తగిన చికిత్స తీసుకుని సాధారణ జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. వ్యసనాల నిర్మూలనకు సమాజం మొత్తం బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రాజశ్రీ, డ్రగ్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, శ్రీలత, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాన్, ఫోరెన్సిక్ విభాగాధిపతి డా. నాగమోహన్, నోడల్ అధికారి డా. రాజేందర్, సైకియాట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.








