పాల్వంచ మండలంలోని నాగారం గ్రామపంచాయతీలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా సర్పంచ్ స్వప్నపై ట్రాక్టర్ యజమాని దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సర్పంచ్ భర్త వెంకటేష్ కూడా గాయపడినట్లు సమాచారం.
ఆదివారం నాడు నాగారం గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సర్పంచ్ స్వప్న గుర్తించారు. వెంటనే ఆమె అక్కడికి చేరుకుని రవాణాను అడ్డుకున్నారు.
సర్పంచ్ అడ్డుకోవడంతో ఆగ్రహించిన ట్రాక్టర్ యజమాని, ఆమెను నెట్టేసి, ఆమె భర్త వెంకటేష్‌పై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు మహిళా సర్పంచ్‌పై దాడి జరగడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.











