సంగారెడ్డి, 2026-08-02
రాజకీయాల్లో విలువలు, విశ్వాసం, అనుబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే అరుదైన సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. 1990లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి దామోదర్ రాజనర్సింహతో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో ఏర్పడిన పరిచయాన్ని పోలీస్ కృష్ణ (పెట్రోల్ బంక్) నేటికీ కొనసాగిస్తున్నారు.
రాజకీయాల్లో విలువలు, విశ్వాసం, అనుబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే అరుదైన సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. 1990లో ఆందోల్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో అప్పట్లో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో ఏర్పడిన పరిచయాన్ని పోలీస్ కృష్ణ (పెట్రోల్ బంక్) నేటికీ అదే అభిమానంతో కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కృష్ణ మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. సుమారు 36 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ అనుబంధం రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా నిలిచింది.
ఈ సందర్భంగా పోలీస్ కృష్ణ మాట్లాడుతూ, దామోదర్ రాజనర్సింహ ఎంతటి ఉన్నత పదవులు చేపట్టినా కార్యకర్తలను, అభిమానులను ఎప్పుడూ ఆదరిస్తూ ముందుకు సాగుతారని అన్నారు. కాలం మారినా నాయకుడిపై తనకున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని, పార్టీ బలోపేతానికి తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు.
మంత్రి దామోదర్ రాజనర్సింహపోలీస్ కృష్ణ (పెట్రోల్ బంక్)ల మధ్య కొనసాగుతున్న 36 ఏళ్ల సుదీర్ఘ స్నేహబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు అభినందనలు తెలిపారు.











