భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సాదు సంగీత (33) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, వరంగల్ జిల్లాకు చెందిన సాదు సంగీత ప్రస్తుతం భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఆమె తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనపై తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.







