కామారెడ్డి జిల్లా కేంద్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదిత్య హాస్పిటల్ సహకారంతో ఒక మెగా రక్తదాన శిబిరం ఆదివారం ఉదయం 9 గంటల నుండి నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఆదిత్య హాస్పిటల్లో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి, మరియు ఆదిత్య హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అజయ్ పేరాల ఈ రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడటానికి రక్తదానం అత్యవసరమని, యువత ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ, ఆదిత్య హాస్పిటల్ సహకారంతో ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైద్యశాల నిర్వాహకులకు, రక్తదాతల సమూహానికి, మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తదానం చేసే మొదటి వందమందికి ప్రత్యేక బహుమతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
రక్తదానం చేయాలనుకునేవారు 9492874006, 9885707042 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, మరియు సలహాదారు మందుల రామచంద్రం వంటి పలువురు పాల్గొన్నారు.












