కామారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని మున్సిపల్ షాపుల నెలసరి అద్దె బకాయిలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించని షాపులను సీజ్ చేశారు.
కామారెడ్డి మున్సిపాలిటీ అధికారులు అద్దె బకాయిలు చెల్లించని షాపులపై నేరుగా రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు. మొండి వైఖరి ప్రదర్శించిన షాపులను గుర్తించి, వాటిని సీజ్ చేశారు. బకాయిల వసూళ్ల విషయంలో ఇకపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ చర్యల నేపథ్యంలో, ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో భాగంగా ఈ రోజు సుమారు ₹7,11,967 వసూలు చేసినట్లు మున్సిపల్ వర్గాలు వెల్లడించాయి. బకాయిల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేస్తూ, మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
బకాయిలపై కఠిన చర్యలు ప్రారంభించిన మున్సిపాలిటీ, ఈ ప్రక్రియ ద్వారా ఆదాయాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
మున్సిపల్ అధికారులు, బిల్ కలెక్టర్లు మరియు సంబంధిత సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర అభివృద్ధికి పన్నులు, అద్దెలు సమయానికి చెల్లించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












