సదాశివపేట, 2026-08-03
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు వచ్చేవరకు నిరంతరం పోరాటం కొనసాగించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే- ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ తీర్మానించింది. ఈ మేరకు సదాశివపేటలో జరిగిన జిల్లా కార్యవర్గ తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు వచ్చేవరకు నిరంతరం పోరాటం కొనసాగించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే- ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ తీర్మానించింది. జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన సదాశివపేటలో సోమవారం జిల్లా కార్యవర్గ తొలి సమావేశం జరిగింది.
సమస్యలపై చర్చ, కార్యాచరణ రూపకల్పన
ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే.పైసల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించారు. అంతేకాకుండా వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించారు. సంగారెడ్డితో పాటు, జహీరాబాద్, సదాశివపేట, నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
యూనియన్ బలోపేతానికి సూచనలు
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఆర్ అనిల్ కుమార్ లు మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి అన్వర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, కోశాధికారి శ్రీధర్ జైన్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు సిద్ధిక్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌహన్, ఉపాధ్యక్షుడు నజీర్, కోశాధికారి లక్ష్మణ్, రాష్ట్ర నాయకుడు బాసిత్, ఐజేయూ సభ్యుడు సిద్ధన్న పాటిల్, సదాశివపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాజీ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనాథ్, మతీన్, సత్యనారాయణ రెడ్డి, కిషోర్ మల్లేశం, సంయుక్త కార్యదర్శులు ఉల్లిగడ్డల శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి, సుమన్ తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీలు విల్సన్, ఆంజనేయులు, ఉల్వల రాజు, సదాశివపేట జర్నలిస్టులు నరేష్, విశ్వనాధ్, జయ రాములు, లింగం, జహీరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మీనాజ్ తదితరులు పాల్గొన్నారు.











