భారత సైన్యంలోకి అత్యాధునిక ఆత్మాహుతి (సూసైడ్) డ్రోన్లు చేరాయి. సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్‌ఎఫ్‌పీవీ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల కోసం రక్షణ శాఖ రూ.10 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.
రక్షణ శాఖ, ఇన్‌సైడ్‌ఎఫ్‌పీవీ కంపెనీ మధ్య గత డిసెంబర్లో కుదిరిన ఒప్పందం ప్రకారం, కంపెనీ రెండు నెలల్లోనే వందలాది కామికేజ్ డ్రోన్లను భారత ఆర్మీకి అందించింది. ఈ డ్రోన్లు శత్రు స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేయడానికి ఉపయోగపడతాయి.
ఈ డ్రోన్లు గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. 2.5 కి.మీ ఎత్తు వరకు ఎగరడంతో పాటు, 10 కి.మీ దూరం వరకు ప్రయాణించగలవు. వీటిలో 2.5 కేజీల పేలుడు పదార్థాన్ని అమర్చవచ్చు.
దేశీయ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ డ్రోన్ల చేరికతో భారత సైనిక సామర్థ్యం మరింత పెరగనుంది.







